Big Breaking : ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నికలు మళ్లీ వాయిదా..

|

May 06, 2020 | 5:39 PM

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌ ఎల‌క్ష‌న్స్ మరికొంత కాలం వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేషన్ జారీచేసింది. కరోనా కంట్రోల్ లోకి రాక‌పోవ‌డ‌వంతో వాయిదాను కొనసాగించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కొనసాగింపు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిపివేత కొనసాగిస్తున్నామన్న ఎస్‌ఈసీ.. పరిస్థితులు అదుపులోకి వ‌చ్చాక స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కోవిడ్-19 కార‌ణంగా లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ ను తొలుత ఆరు వారాల పాటు వాయిదా వేసింది ఎస్​ఈసీ. మార్చి 15 నుంచి ఆరు […]

Big Breaking : ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నికలు మళ్లీ వాయిదా..
Follow us on

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌ ఎల‌క్ష‌న్స్ మరికొంత కాలం వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేషన్ జారీచేసింది. కరోనా కంట్రోల్ లోకి రాక‌పోవ‌డ‌వంతో వాయిదాను కొనసాగించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కొనసాగింపు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిపివేత కొనసాగిస్తున్నామన్న ఎస్‌ఈసీ.. పరిస్థితులు అదుపులోకి వ‌చ్చాక స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

కోవిడ్-19 కార‌ణంగా లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ ను తొలుత ఆరు వారాల పాటు వాయిదా వేసింది ఎస్​ఈసీ. మార్చి 15 నుంచి ఆరు వారాల పాటు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసింది. గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేసిన‌ ఎస్​ఈసీ కనగరాజ్… తదుపరి ఆర్డ‌ర్స్ వ‌చ్చేవ‌ర‌కు ఎన్నికలు ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటిఫికేషన్ జారీచేసింది.