రివర్స్‌తో అన్నీ కష్టాలే.. పీపీఏ నివేదిక

| Edited By:

Aug 24, 2019 | 1:21 AM

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల జరిగే నష్టాలను పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా అందించింది. 12 పేజీల ఈ నివేదకలో పలు అంశాలను వెల్లడించింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ ప్రభుత్వం తీరుతో అనేక న్యాయపరమైన ఇబ్బందులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయని పీపీఏ పేర్కొంది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోడానికి రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకున్నామన్న ఏపీ ప్రభుత్వ […]

రివర్స్‌తో అన్నీ కష్టాలే.. పీపీఏ నివేదిక
Follow us on

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల జరిగే నష్టాలను పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా అందించింది. 12 పేజీల ఈ నివేదకలో పలు అంశాలను వెల్లడించింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ ప్రభుత్వం తీరుతో అనేక న్యాయపరమైన ఇబ్బందులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయని పీపీఏ పేర్కొంది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోడానికి రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకున్నామన్న ఏపీ ప్రభుత్వ వాదనతో పీపీఏ విభేదించించింది. ప్రస్తుతం తక్కువ ధరకు కాంట్రాక్టర్ వస్తారన్న నమ్మకం లేదని, దీంతో రాష్ట్రంపై ప్రాజెక్టు నిర్మాణం అధిక భారంగా మారుతుందని నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించడమే మంచిదని అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.