కరోనా అప్‌డేట్స్: ఏపీ ఖాతాలో మరో రికార్డు.. దేశంలోనే తొలి స్థానం

| Edited By:

Jul 05, 2020 | 4:28 PM

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పది లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనా అప్‌డేట్స్: ఏపీ ఖాతాలో మరో రికార్డు.. దేశంలోనే తొలి స్థానం
Follow us on

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పది లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 20,567 పరీక్షలు చేయగా.. మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,17,140కి చేరింది. దీంతో దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే  కాగా దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివ్‌గా తేలిన వారి కాంటాక్ట్‌లను ట్రేస్ చేస్తోన్న అధికారులు వారిని క్వారంటైన్‌లో ఉంచుతూ వస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తోన్న వారికి టెస్ట్‌లు నిర్వహిస్తూ.. హోం క్వారంటైన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఏపీలో 10043 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 232 మంది మరణించారు.