Breaking: నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

| Edited By:

Aug 07, 2020 | 8:55 PM

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30న నీలం పదవీ విరమణ చేయాల్సి ఉండగా

Breaking: నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
Follow us on

AP CS Nilam Sawhney: ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30న నీలం పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. మరోసారి పదవీ కాలం పొడిగించారు. తాజా ఉత్తర్వులతో డిసెంబర్ 31వరకు సాహ్ని సీఎస్‌గా కొనసాగనున్నారు.

కాగా 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ సేవలను అందించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ పీడీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక గతేడాది నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. జూన్ 30న రిటైరయ్యారు. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా నీలం సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని, ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని జగన్ సర్కార్,‌ కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మూడు నెలలు మాత్రమే పొడిగించగా.. సెప్టెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి ఆమె పదవీకాలాన్ని పొడిగించమని జగన్ కేంద్రాన్ని కోరారు. ఇక కేంద్ర అనుమతితో మరోసారి సాహ్ని పదవీ కాలం పొడిగించినట్లు తెలుస్తోంది.

Read This Story Also: హోం ఐసోలేషన్‌ తప్పనిసరి.. బీఎంసీ కీలక నిర్ణయం