“అనర్హత”ను ఆపండి..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

|

Jul 03, 2020 | 12:21 PM

వైసీసీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై "అనర్హత" వేటు, "సస్పెన్షన్"‌ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్‌ వేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు...

అనర్హతను ఆపండి..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీసీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై “అనర్హత” వేటు, “సస్పెన్షన్”‌ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్‌ వేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాయని కానీ… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని రఘు రామకృష్ణ రాజు పిటిషన్‌లో వివరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లానని విన్నవించారు. ఈసీ నిర్ణయం వెలువడే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని అభ్యర్థించారు. అయితే  ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులను మాత్రమే ఏపీ హైకోర్టు విచారిస్తోంది. దీంతో ఎంపీ రఘు రామకృష్ణ రాజు పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే  ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.