చంద్రబాబునాయుడు, దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని జగన్‌ను తిట్టించినప్పుడు లేని పైశాచిక ఆనందం ఇప్పుడెందుకని నిలదీశారు. చంద్రబాబులా ఎవరికీ జగన్ కండువాలను కప్పలేదన్న నాని.. స్వతహాగా వారే వచ్చారని గుర్తుచేశారు. సన్నబియ్యం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదన్న కొడాలి.. నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే ఇస్తామన్నారు. దేవినేని ఉమా చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో నాని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీని మోసగించి టీడీపీలోకి వెళ్లిన దేవినేని ఉమా.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తోడుగా నిలిచాడని విరుచుకుపడ్డారు. ఉమాను కొడాలి నాని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొడాలి నాని ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు: