అమరావతిలో అపశృతి.. లిఫ్ట్ కూలి.. ముగ్గురు మృతి..

| Edited By: Srinu

Jul 23, 2019 | 1:45 PM

ఏపీ రాజధాని నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. తుళ్లూరు మండల పరిధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ నిర్మాణంలో లిఫ్ట్ కుప్పకూలడంతో ముగ్గురు చనిపోయారు. నిర్మాణంలో 5వ క్వార్టర్‌లోని ఓ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు 5 వ బ్లాక్ నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు తేల్చారు. మృతులు రాహుల్ కుమార్, క్రిపాల్ కుమార్, సురేందర్ […]

అమరావతిలో అపశృతి.. లిఫ్ట్ కూలి.. ముగ్గురు మృతి..
Follow us on

ఏపీ రాజధాని నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. తుళ్లూరు మండల పరిధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ నిర్మాణంలో లిఫ్ట్ కుప్పకూలడంతో ముగ్గురు చనిపోయారు. నిర్మాణంలో 5వ క్వార్టర్‌లోని ఓ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు 5 వ బ్లాక్ నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు తేల్చారు. మృతులు రాహుల్ కుమార్, క్రిపాల్ కుమార్, సురేందర్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.