పవన్‌కు రాపాక మరో షాక్.. రాజధానిపై సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Jan 04, 2020 | 4:12 PM

ఏపీలో రాజధాని వివాదం ఇంకా కొనసాగుతోంది. వైసీసీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో సైతం ఈ ప్రకటనపై రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిర్ణయానికి ఓటేస్తుంటే.. మరికొందరు ఇదో తుగ్లక్ చర్య అంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని ఆయన […]

పవన్‌కు రాపాక మరో షాక్.. రాజధానిపై సంచలన వ్యాఖ్యలు
Follow us on

ఏపీలో రాజధాని వివాదం ఇంకా కొనసాగుతోంది. వైసీసీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో సైతం ఈ ప్రకటనపై రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిర్ణయానికి ఓటేస్తుంటే.. మరికొందరు ఇదో తుగ్లక్ చర్య అంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు.

పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలున్నప్పుడు.. పార్టీలో రెండు అభిప్రాయాలుండటం తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని.. కానీ తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమని రాపాక చెప్పుకొచ్చారు. చిరంజీవి సైతం 3 రాజధానులను సమర్ధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించలేదని.. ఎక్కడ పెడతారో స్పష్టం చేయమని అడుగుతున్నారని రాపాక తెలిపారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని.. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.