యరపతినేనికి ఏపీ హైకోర్టు షాక్.. సీబీఐ విచారణకు అనుమతి

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2019 | 3:30 PM

టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసుపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ విచారణకు వెళ్లాలా..? వద్దా..? అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిన హైకోర్టు.. దీనిపై బుధవారం లోగా నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. కాగా విచారణ సందర్భంగా ఆంధ్రా బ్యాంకులో యరపతినేని అక్రమ నగదు లావాదేవీలను గుర్తించిన సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా అక్రమ […]

యరపతినేనికి ఏపీ హైకోర్టు షాక్.. సీబీఐ విచారణకు అనుమతి
Follow us on

టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసుపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ విచారణకు వెళ్లాలా..? వద్దా..? అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిన హైకోర్టు.. దీనిపై బుధవారం లోగా నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. కాగా విచారణ సందర్భంగా ఆంధ్రా బ్యాంకులో యరపతినేని అక్రమ నగదు లావాదేవీలను గుర్తించిన సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా అక్రమ మైనింగ్ జరిగిందని తేలిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్బంగా ఆయనపై ఈడీ విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఏపీలో ఎన్నికల తరువాత యరపతినేని అఙ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ యరపతినేని కనిపించలేదు.