ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

| Edited By:

Mar 29, 2019 | 11:26 AM

ఐపీఎస్ బదిలీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమంటూ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. “నోకేస్ ఫర్ ఇంటరిమ్ రిలీఫ్” అని పేర్కొంటూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. మరోవైపు టీడీపీ నేతలు ఈసీని కలిసేందుకు సిద్ధమౌతున్నారు. బదిలీల వ్యవహారంపై తమ వాదనను ఈసీకి వినిపించనుంది టీడీపీ నేతల బృందం. వైసీపీ నేతల బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ రాహుదేవ్ శర్మ, శ్రీకాకుళం జిల్లా […]

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
Follow us on

ఐపీఎస్ బదిలీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమంటూ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. “నోకేస్ ఫర్ ఇంటరిమ్ రిలీఫ్” అని పేర్కొంటూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. మరోవైపు టీడీపీ నేతలు ఈసీని కలిసేందుకు సిద్ధమౌతున్నారు. బదిలీల వ్యవహారంపై తమ వాదనను ఈసీకి వినిపించనుంది టీడీపీ నేతల బృందం.

వైసీపీ నేతల బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ రాహుదేవ్ శర్మ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నంలను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దీనిపై టీడీపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించింది. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుకు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా బదిలీ చేశారంటూ న్యాయస్థానానికి విన్నవించింది. ఇందులో రాజకీయ కుట్ర దాగుందని ఆరోపించింది. ఇంటెలిజెన్స్ ఐజీ డిపార్ట్‌మెంట్.. ఈసీ పరిధిలోకి రాదని హైకోర్టుకు తెలిపింది. అంతేకాదు.. ఈసీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బదిలీ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీని మినహాయిస్తూ జీవో జారీ చేసింది.