కరోనాపై కఠిన చర్యలు… ఆయా జిల్లాలో కర్ఫ్యూ అమ‌లు

|

Apr 12, 2020 | 2:30 PM

ఏపీ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ..

కరోనాపై కఠిన చర్యలు... ఆయా జిల్లాలో కర్ఫ్యూ అమ‌లు
Follow us on
ఏపీ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 405కు చేరింది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం  సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్తగా 24 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూల్ 5, ప్రకాశం,కడప జిల్లాల్లో  ఒక్కొక్క కేసు వచ్చాయి.  405 కేసుల్లో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు.  వైర‌స్ బారిన‌ప‌డి ఆరుగురు చ‌నిపోయారు. అనంతపురం 2, కృష్ణా 2, గుంటూరు 1, కర్నూలు 1 చొప్పున చనిపోయారు. ప్రస్తుతం 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక, గుంటూరు జిల్లాలో 74 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  అధికంగా ఉండటంతో   అధికారులు నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేశారు.   కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఉదయం నుంచి పూర్తి లాక్ డౌన్ జరుగుతోంది. నగర పరిధిలో నిన్నటివరకూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ రోజు మాత్రం పూర్తి లాక్ డౌన్ విధించారు.   కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరిచి ఉంచారు.