Breaking: జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు షాక్

| Edited By:

Jun 18, 2020 | 3:57 PM

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు షాక్ తగిలింది. వారి బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది.

Breaking: జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు షాక్
Follow us on

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు షాక్ తగిలింది. వారి బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. తమకు బెయిల్ కావాలంటూ వారిద్దరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం కోర్టు న్యాయమూర్తి విచారించారు. మరోవైపు ఇంకో మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను పీటీ వారెంట్‌పై కస్టడీకి కోరారు అనంతపురం వన్‌టౌన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు కడప సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసులో జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డిని బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కోవిడ్ నుంచి కోలుకుంటున్నా: ఎమ్మెల్యే బాజిరెడ్డి