సభను హుందాగా నడిపిద్దాం: సీఎం జగన్

|

Jul 03, 2019 | 6:11 PM

శాసనసభలో, మండలిలో సభ్యులు ఎలా ప్రవర్తించాలి..నిబంధనల ఎలా ఉంటాయో ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వంలా ఎకపక్ష వైఖరి అవలంభించుకుండా గౌరవ స్పీకర్  సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ […]

సభను హుందాగా నడిపిద్దాం: సీఎం జగన్
Follow us on

శాసనసభలో, మండలిలో సభ్యులు ఎలా ప్రవర్తించాలి..నిబంధనల ఎలా ఉంటాయో ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వంలా ఎకపక్ష వైఖరి అవలంభించుకుండా గౌరవ స్పీకర్  సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు నిపుణులు పాల్గొని సభ్యలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.