జగన్‌ ప్లాన్.. రాయలసీమకు కొత్త రూపు..!

| Edited By:

Oct 22, 2019 | 10:10 AM

రాయలసీమ అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయలసీమకు కొత్త రూపును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గ్రేటర్ రాయలసీమలో భాగమైన 6 జిల్లాలను కాస్తా 12 జిల్లాలుగా చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా.. అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా.. చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా.. వైఎస్సార్ కడప […]

జగన్‌ ప్లాన్.. రాయలసీమకు కొత్త రూపు..!
Follow us on

రాయలసీమ అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయలసీమకు కొత్త రూపును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గ్రేటర్ రాయలసీమలో భాగమైన 6 జిల్లాలను కాస్తా 12 జిల్లాలుగా చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా.. అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా.. చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా.. వైఎస్సార్ కడప జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పది జిల్లాలకు తోడు గ్రేటర్ రాయలసీమలో భాగమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలు యధావిధిగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటును చేయాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తోంది. అయితే ఇక వీటిని ముందుగా ఏర్పాటు చేయాలా..? లేక పరిషత్‌ ఎన్నికలను ముందుగా నిర్వహించాలా..? అనే దానిపై తేల్చుకోలేక వైసీపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముందే ఎన్నికలు జరిపితే, ఆ తరువాత పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పాటు చేసే కొత్త జిల్లాల పాలనలో సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావిస్తుందట. ఈ క్రమంలో ఎన్నికల ముందుగానే ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది.