జగన్‌పై అసభ్యకర పోస్ట్‌లు.. ఏపీ పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు

| Edited By:

May 11, 2020 | 7:34 PM

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎం.వీ.విద్యాసాగర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం జగన్‌ని, ప్రభుత్వ‌ విధానాలను అసభ్యకరంగా తిడుతూ విద్యాసాగర్ వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని పోస్ట్‌లు పెట్టారు. డీఈఈ పెట్టిన ఈ పోస్ట్‌లను వాట్సాప్‌లో ఉన్న మిగిలిన ఉద్యోగులు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించిన సీఐడీ సునీల్ కుమార్ సెక్షన్ 25 ఏపీఎస్పీహెసీ ప్రకారం విద్యాసాగర్‌పై డిస్ప్లైనరీ యాక్షన్ తీసుకున్నట్లు వెళ్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే […]

జగన్‌పై అసభ్యకర పోస్ట్‌లు.. ఏపీ పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు
Follow us on

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎం.వీ.విద్యాసాగర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం జగన్‌ని, ప్రభుత్వ‌ విధానాలను అసభ్యకరంగా తిడుతూ విద్యాసాగర్ వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని పోస్ట్‌లు పెట్టారు. డీఈఈ పెట్టిన ఈ పోస్ట్‌లను వాట్సాప్‌లో ఉన్న మిగిలిన ఉద్యోగులు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించిన సీఐడీ సునీల్ కుమార్ సెక్షన్ 25 ఏపీఎస్పీహెసీ ప్రకారం విద్యాసాగర్‌పై డిస్ప్లైనరీ యాక్షన్ తీసుకున్నట్లు వెళ్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పదని ఈ సందర్భంగా సునీల్ కుమార్ హెచ్చరించారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ వలన జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నా..!