YS Bharathi: సీఎం సతీమణి పీఏ పేరుతో ఘరానా మోసం.. !

| Edited By:

Feb 14, 2020 | 11:12 AM

YS Bharathi: ప్రముఖుల పేర్లు చెప్పి పలువురు కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుండటం కొత్తేం కాదు. ముఖ్యంగా రాజకీయ, సినీ సెలబ్రిటీల పేరుతో తరచుగా మోసాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతి పేరుతో జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయితీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని జగదీష్ సత్యశ్రీరాం అనే కేటుగాడు మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగి నుంచి డబ్బు వసూలు […]

YS Bharathi: సీఎం సతీమణి పీఏ పేరుతో ఘరానా మోసం.. !
Follow us on

YS Bharathi: ప్రముఖుల పేర్లు చెప్పి పలువురు కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుండటం కొత్తేం కాదు. ముఖ్యంగా రాజకీయ, సినీ సెలబ్రిటీల పేరుతో తరచుగా మోసాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతి పేరుతో జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయితీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని జగదీష్ సత్యశ్రీరాం అనే కేటుగాడు మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగి నుంచి డబ్బు వసూలు చేసిన సత్యశ్రీరాం.. ఎన్నిరోజులైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన సత్య శ్రీరామ్ గతంలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి మానేసి.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భారతి పీఏ పేరుతో అతడు ముగ్గురికి టోకరా పెట్టినట్లు తెలుస్తోంది.