కార్యాలయాల తరలింపు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..!

| Edited By: Srinu

Feb 04, 2020 | 4:57 PM

జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి నుంచి విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాలను ఎలా తరలిస్తారంటూ మండిపడింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల తరలింపుపై ఈ నెల 26వ తేది వరకు స్టే ఇచ్చింది. మరోవైపు ఈ పిటిషన్లపై మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. కాగా మూడు రాజధానుల […]

కార్యాలయాల తరలింపు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..!
Follow us on

జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి నుంచి విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాలను ఎలా తరలిస్తారంటూ మండిపడింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల తరలింపుపై ఈ నెల 26వ తేది వరకు స్టే ఇచ్చింది. మరోవైపు ఈ పిటిషన్లపై మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు.

కాగా మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా వడివడిగా అడుగులు వేస్తోన్న జగన్ ప్రభుత్వం.. అందులో భాగంగా విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూల్‌కు తరలిస్తూ శుక్రవారం అర్ధరాత్రి జీవో జారీ చేసింది. దీనిపై కారుమంచి ఇంద్రనీల్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు కార్యాయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో మొత్తం మూడు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.