ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్..!

| Edited By:

Oct 26, 2019 | 12:44 PM

ఏపీలో నిరుద్యోగ యువతకు మరోసారి శుభవార్త అందించింది జగన్ సర్కార్. మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి నవంబరు 1 నుంచి దరఖాస్తు […]

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్..!
Follow us on

ఏపీలో నిరుద్యోగ యువతకు మరోసారి శుభవార్త అందించింది జగన్ సర్కార్. మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులకు సంబంధించి నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వనుండగా.. అభ్యర్థులు నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నవంబరు 15 నుంచి దరఖాస్తుల పరిశీలన.. ఆ తరువాత నవంబరు 16 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుందని గిరిజాశంకర్ వెల్లడించారు.