Breaking: ఏపీ హైకోర్టు కొత్త ప్రభుత్వ న్యాయవాదులు వీరే..!

| Edited By:

Jun 11, 2020 | 5:54 PM

ఏపీ హైకోర్టు జీపీలుగా(ప్రభుత్వ న్యాయవాదులు) ముగ్గురు కొత్త న్యాయవాదులు నియామకం అయ్యారు. జె.సుమతి ,వడ్డీబోయన సుజాత , కిరణ్ తిరుమలశెట్టిలను ముగ్గురు న్యాయవాదులుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: ఏపీ హైకోర్టు కొత్త ప్రభుత్వ న్యాయవాదులు వీరే..!
Follow us on

ఏపీ హైకోర్టు జీపీలుగా(ప్రభుత్వ న్యాయవాదులు) ముగ్గురు కొత్త న్యాయవాదులు నియామకం అయ్యారు. జె.సుమతి ,వడ్డీబోయన సుజాత , కిరణ్ తిరుమలశెట్టిలను ముగ్గురు న్యాయవాదులుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టులో పనిచేస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌ బాబు, షేక్‌ హబీబ్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. దాదాపు ప్రతి కేసులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఈ ముగ్గురు ఓ లేఖలో పేర్కొన్నారు. ఇక వీరి రాజీనామాకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం కొత్తగా ముగ్గురిని నియమించింది. కాగా జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దాదాపు ప్రతి విషయంలోనూ సర్కార్‌కి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల నుంచి ఇంగ్లిష్ మీడియం, నిమ్మగడ్డ వ్యవహారం వరకు దాదాపు అన్ని అంశాల్లోనూ జగన్ సర్కార్‌కి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న విషయం తెలిసిందే.

Read This Story Also: భారతీయ నర్సుపై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆడమ్‌ ప్రశంసలు..!