ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పార్టీలతో భేటీ కానున్న ఈసీ..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 15, 2020 | 11:57 AM

ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 17న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ సమావేశం శుక్రవారం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో […]

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పార్టీలతో భేటీ కానున్న ఈసీ..!
Follow us on

ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 17న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు.

ఈ సమావేశం శుక్రవారం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఇక ఈ సమావేశానికి వైసీపీ, టీడీపీ, జనసేన, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీ, అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు.