కొత్తగా 1088 అంబులెన్స్‌లను ప్రారంభించిన జగన్..

|

Jul 01, 2020 | 2:02 PM

ఏపీలో అధునాతన 104, 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 1068 వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించగా.. అంబులెన్స్‌లు ప్రజాసేవకు పయనమయ్యాయి.

కొత్తగా 1088 అంబులెన్స్‌లను ప్రారంభించిన జగన్..
Follow us on

ఏపీలో అధునాతన 104, 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 1088 వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించగా.. అంబులెన్స్‌లు ప్రజాసేవకు పయనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మండలంలో ఈ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి. సుమారు రూ. 201 కోట్ల వ్యయంతో ఈ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది.

676 నూతన 104 వాహనాలు, 412 కొత్త 108 వాహనాలు రోడ్డెక్కాయి. ఇక అటు పిల్లలు, గర్భిణీల కోసం నియోనిటల్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!