జగన్ కీలక నిర్ణయం… రైతులకు ప్రత్యేక కాల్ సెంటర్..

|

May 30, 2020 | 2:06 PM

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏకకాలంలో ప్రారంభించారు. వీటితో పాటుగా CM యాప్‌ను కూడా ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్న సీఎం.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండనుందని స్పష్టం చేశారు. అలాగే రైతుల కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేక […]

జగన్ కీలక నిర్ణయం... రైతులకు ప్రత్యేక కాల్ సెంటర్..
Follow us on

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏకకాలంలో ప్రారంభించారు. వీటితో పాటుగా CM యాప్‌ను కూడా ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్న సీఎం.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండనుందని స్పష్టం చేశారు.

అలాగే రైతుల కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నెంబర్ 155251 ద్వారా రైతులకు పంటలకు సంబంధించి సూచనలు, సలహాలు అందించనుంది. కాగా, రైతు భరోసా కేంద్రాల రైతులకు శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా ఉండనున్నాయి.

Also Read: జగన్ సర్కార్ సంచలనం.. పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు..