మంచి చేస్తే అడ్డుకుంటారా..?: చంద్రబాబు పై జగన్ ఫైర్

| Edited By: Srinu

Jul 24, 2019 | 2:03 PM

ఏపీ అసెంబ్లీలో వైఎస్ ఆర్ చేయూత పథకం పై హాట్ హాట్ గా చర్చ జరిగింది. ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రతిపక్షం అడ్డుకుంటోందని సీఎం జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ మంది పేరు వస్తుందోనని కావాలనే ఇలాంటి కార్యక్రమాలను అసెంబ్లీలో చంద్రబాబు అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలోనే తాము మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ […]

మంచి చేస్తే అడ్డుకుంటారా..?: చంద్రబాబు పై జగన్ ఫైర్
Follow us on

ఏపీ అసెంబ్లీలో వైఎస్ ఆర్ చేయూత పథకం పై హాట్ హాట్ గా చర్చ జరిగింది. ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రతిపక్షం అడ్డుకుంటోందని సీఎం జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ మంది పేరు వస్తుందోనని కావాలనే ఇలాంటి కార్యక్రమాలను అసెంబ్లీలో చంద్రబాబు అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలోనే తాము మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని నాడే హామీ ఇచ్చామన్నారు సీఎం జగన్. (విశాఖ జిల్లా మాడుగులలో జరిగిన పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు జగన్) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే ప్రతిపక్షం కావాలనే అడ్డుకుంటోందని సీఎం జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇదిలా వుంటే మరోవైపు అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.