జగన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధం.. హైకోర్టుకు నిమ్మగడ్డ..!

| Edited By:

Apr 12, 2020 | 7:27 AM

ఈసీగా తనను తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

జగన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధం.. హైకోర్టుకు నిమ్మగడ్డ..!
Follow us on

ఈసీగా తనను తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనను తొలగిస్తూ జారీ చేసిన జీవో రాజ్యంగ వ్యతిరేకమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరఫున లాయర్ అశ్వనీకుమార్ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టు దాన్ని విచారణకు తీసుకుంది. అలాగే వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో ఇద్దరు వ్యక్తులు సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.

కాగా ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పదవి నుంచి దిగేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. ఆ స్థానంలో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను నియమించింది. శనివారం కనగరాజ్‌ పదవిని కూడా చేపట్టారు. కాగా మద్రాస్‌ హైకోర్టులో 9ఏళ్లు జడ్జిగా పనిచేసిన కనగరాజ్‌.. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా పనిచేశారు.

Read This Story Also: మ‌హిళా అభిమానికి అంజ‌నీ పుత్రుడి సాయం..జై చిరంజీవ‌..!