డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

|

Nov 04, 2020 | 5:56 PM

డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించినట్టుగా తెలిపారు. సత్యనారాయణపై ఇటీవల పలు ఆరోపణలు..

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు
Follow us on

డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలనుంచి లంచాలు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఏసీబీ అధికారులు అతని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కరెన్సీ నగరంలోని వెంకట శివ సత్యనారాయణ నివాసంలో ఏసీబీ సోదాలు జరిపారు. ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించినట్టుగా తెలిపారు. సత్యనారాయణ భార్య, కొడుకు పేరిట 3 భవనాలు, హైదరాబాద్‌లో ఫ్లాట్‌, జక్కంపూడి, కంచికచర్లలో స్థలాలున్నట్లు అధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2.5 ఎకరాల భూమి, రూ.50 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు… రూ. 15 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌, 218 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు బ్యాంక్‌ లాకర్స్‌ గుర్తించారు.