Andhra Pradesh: ఆ మూడు కిలోమీటర్లు డోలి కట్టాల్సిందే.. పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు..?

| Edited By: Shaik Madar Saheb

Aug 04, 2024 | 8:25 AM

అల్లూరి ఏజెన్సీలో గిరిజనులకు రహదారి కష్టాలు అన్ని ఇన్ని కావు. అత్యవసర సమయాల్లో అయితే.. ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను తరిలించాలన్నా.. ఎవరైనా అనారోగ్యం పాలైనా, ఏదైనా పామో, పురుగో కాటేసినా.. ఇలా అత్యవసర సమయంలో తరలించాలంటే డోలి కట్టాల్సిందే..!

Andhra Pradesh: ఆ మూడు కిలోమీటర్లు డోలి కట్టాల్సిందే.. పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు..?
Doli
Follow us on

అల్లూరి ఏజెన్సీలో గిరిజనులకు రహదారి కష్టాలు అన్ని ఇన్ని కావు. అత్యవసర సమయాల్లో అయితే.. ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను తరిలించాలన్నా.. ఎవరైనా అనారోగ్యం పాలైనా, ఏదైనా పామో, పురుగో కాటేసినా.. ఇలా అత్యవసర సమయంలో తరలించాలంటే డోలి కట్టాల్సిందే..! తాజాగా నెలలు నిండిన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కిలోమీటర్ల దూరం మోయలేక ఇంట్లోనే కాన్పు వేయాలని స్థానికులు భావించారు. ప్రాణాల పైకి వచ్చే ప్రమాదం ఉందని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో డోలి కట్టి ఆసుపత్రికి పరుగులు పెట్టారు.. దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా రాళ్లు, రప్పలు, పొదలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ మోసుకెళ్లారు. పొలాల మధ్య గట్టుపై నుంచి నిండు గర్భిణీకి మోసుకెళ్లి ఆ తర్వాత 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇలా నిండు గర్భిణీ పురిటి కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వచ్చింది.

వీడియో చూడండి..

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి. సంపాలు గ్రామానికి చెందిన పాంగి చిన్నతల్లి నిండు గర్భిణీ. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో కొండలు దాటుకుంటూ మూడు కిలో మీటర్లు డోలి మోసారు. అక్కడ నుండి వాహనంలో పాడేరు జిల్లా ఆసుపత్రికు తరలించారు.

వీడియో చూడండి..

అత్యవసర పరిస్థితులలో రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.. మరి అత్యవసరమైతే ప్రాణాలే పణంగా పెట్టాల్సి వస్తుందేమోనని గిరిజనులు వాపోతున్నారు.. తమ సమస్యను ఆలకించి ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..