వైసీపీ ఎమ్మెల్యే “ఆర్కే”కు తృటిలో తప్పిన ప్రమాదం

|

Feb 29, 2020 | 6:43 AM

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆర్కే హాజరయ్యారు. అయితే నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న సమయంలో.. ఆర్కే స్టేజ్ మీదకు వెళ్లిన సమయంలో సడన్‌గా అది కుప్పకూలింది. దీంతో ఆర్కే కాలికి స్వల్ప గాయమైంది. దీంతో ఆయనను వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఆర్కేను పరీక్షించిన వైద్యులు.. కాలికి చిన్న కట్టు కట్టారు. కాగా..ఎమ్మెల్యే కిందపడిపోవడంతో […]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు తృటిలో తప్పిన ప్రమాదం
Follow us on

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆర్కే హాజరయ్యారు. అయితే నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న సమయంలో.. ఆర్కే స్టేజ్ మీదకు వెళ్లిన సమయంలో సడన్‌గా అది కుప్పకూలింది. దీంతో ఆర్కే కాలికి స్వల్ప గాయమైంది. దీంతో ఆయనను వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఆర్కేను పరీక్షించిన వైద్యులు.. కాలికి చిన్న కట్టు కట్టారు. కాగా..ఎమ్మెల్యే కిందపడిపోవడంతో పెళ్లి వేడుకలో కాసేపు గందరగోళం నెలకొంది.