Vijayawada: లోన్‌ యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. ఫొటోలు మార్ఫింగ్ చేయడంతో మనస్తాపం.. చివరకు…

|

Jan 29, 2023 | 9:55 AM

ఈజీ లోన్‌ మరొకరి ప్రాణం తీసేసింది. అవును, లోన్‌ యాప్‌ వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. లోన్‌ కింకరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. విజయవాడలో మరోసారి లోన్‌ యాప్‌ ఆగడాలు...

Vijayawada: లోన్‌ యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. ఫొటోలు మార్ఫింగ్ చేయడంతో మనస్తాపం.. చివరకు...
suicide
Follow us on

ఈజీ లోన్‌ మరొకరి ప్రాణం తీసేసింది. అవును, లోన్‌ యాప్‌ వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. లోన్‌ కింకరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. విజయవాడలో మరోసారి లోన్‌ యాప్‌ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురంలో బాధితుడు రాజేష్‌ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వేధింపులకు పాల్పడటంతో సూసైడ్‌ చేసుకున్నాడు రాజేష్‌.

రాజేష్‌తోపాటు అతని భార్యను కూడా వేధించారు యాప్‌ నిర్వాహకులు. మార్ఫింగ్‌ ఫొటోలతో రాజేష్‌ భార్యకు మెసేజ్‌ పెడుతూ భార్యాభర్తలిద్దరికీ నిద్ర లేకుండా చేశారు కేటుగాళ్లు. వేధింపులు ఎక్కువైపోవడంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు రాజేష్‌.

కాగా.. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తక్కువ వడ్డీకి రుణం.. ఆశ చూపి అప్పు తీసుకున్న తర్వాత.. భరించలేనంత రేంజ్ లో వడ్డీ వసూలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు అసలు కంటే వడ్డీ ఎక్కువే అవడం గమనార్హం. కట్టకుంటే బజారుకీడుస్తున్నారు. ముక్కుపిండి మరీ వేధిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం