వీడు మామూలోడు కాదు.. ఆదమరిస్తే అంతే సంగతలు..! ఎలా వచ్చిందబ్బా ఈ ఐడియా..?

| Edited By: Balaraju Goud

Jul 20, 2024 | 12:57 PM

రైలు ప్రయాణంలో ఆదమరిచి పోతున్నారా..! ఆ.. ఏమవుతుందిలే చుట్టూ ప్రయాణీకులు ఉన్నారాలే అనుకుంటున్నారు. ఆ ప్రయాణీకుల మాటునే ప్రమాదం పొంచి ఉంది. మీ చేతిలో ఉన్న విలువైన సెల్ ఫోన్, ఖరీదైన ల్యాప్ ట్యాప్ లేదంటే ఒంటి మీదున్న బంగారు ఆభరణాలు మీరు లేచి సరికి మీ దగ్గరుండవు..!

వీడు మామూలోడు కాదు.. ఆదమరిస్తే అంతే సంగతలు..! ఎలా వచ్చిందబ్బా ఈ ఐడియా..?
Thief In Trains
Follow us on

రైలు ప్రయాణంలో ఆదమరిచి పోతున్నారా..! ఆ.. ఏమవుతుందిలే చుట్టూ ప్రయాణీకులు ఉన్నారాలే అనుకుంటున్నారు. ఆ ప్రయాణీకుల మాటునే ప్రమాదం పొంచి ఉంది. మీ చేతిలో ఉన్న విలువైన సెల్ ఫోన్, ఖరీదైన ల్యాప్ ట్యాప్ లేదంటే ఒంటి మీదున్న బంగారు ఆభరణాలు మీరు లేచి సరికి మీ దగ్గరుండవు..! అవి అతని సొంతమైపోతాయి. ఆ తర్వాత మీరు పోలీసులను ఆశ్రయించి లబోదిబోమనాల్సిందే..!

తెనాలి నుండి నెల్లూరు వరకూ ప్రయాణిస్తూ రైల్వే ప్రయాణీకుల వద్ద నుండి విలువైన వస్తువులు కాజేస్తున్న కేటుగాడి ఆటను రైల్వే పోలీసులు కట్టించారు. గత కొంతకాలంగా చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ దొంగతనాల కేసులు ఎక్కువై పోతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ పేరు తెరపైకి వచ్చింది. సాంకేతిక ఆధారాల సాయంతో వివరాలు సేకరించిన రైల్వే పోలీసులు చీరాల స్టేషన్ లో ఉన్న వెంకటేశ్వర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 3.81 లక్షల రూపాయల విలువైన 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 సెల్ ఫోన్లు, 4 ల్యాప్ ట్యాప్‌లు, ఒక ఐ ప్యాడ్, మూడు వాచీలను స్వాధీనం చేసుకున్నారు.

వెంకటేష్ వ్యసనాలను లోనయ్యాడు. విలసవంతమైన జీవితాన్ని గడపటానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే చేతికి కావల్సినంత డబ్బు కోసం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. ఇదే సమయంలో తనకు కావాల్సినంత డబ్బులు రావాలంటూ రైళ్లలో దొంగతనాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం సినిమాల్లో రైళ్ల దొంగతనాలను పరిశీలించాడు. కొన్ని సోషల్ మీడియా సైట్స్ లోనూ రైలు దొంగతనాలు ఎలా చేయాలో చూశాడు. ఇక అప్పటి నుండి రైళ్లలో దొంగతనాలు చేస్తూ తనకు కావాల్సినంత కొట్టేయడం చేస్తున్నాడు. అయితే వరుస వెంట జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులకు వెంకటేష్ దొరికిపోయాడు. అయితే రైలు ప్రయాణాల్లో అపరిచితులను నమ్మవద్దని చీరాల రైల్వే పోలీసులు మరోసారి హెచ్చరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…