అమెరికా.. జార్జ్ హత్యకు నిరసనగా ఆగని ఆందోళనలు

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 6:17 PM

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాడ్ హత్యకు నిరసనగా అమెరికాలో ఆదివారం కూడా హింసాకాండ కొనసాగింది. వీరి ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికను పట్టించుకోకుండా..

అమెరికా.. జార్జ్ హత్యకు నిరసనగా ఆగని ఆందోళనలు
Follow us on

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాడ్ హత్యకు నిరసనగా అమెరికాలో ఆదివారం కూడా హింసాకాండ కొనసాగింది. వీరి ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికను పట్టించుకోకుండా . కర్ఫ్యూను కూడా ఖాతరు చేయకుండా  వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వఛ్చి ర్యాలీలు నిర్వహించారు. మినియాపొ లిస్, షికాగో, అట్లాంటా, సీటెల్, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర అనేక నగరాలు వీరి నిరసనలతో అట్టుడికాయి. జార్జి కుటుంబానికి న్యాయం జరగాలని, అతడి హత్యకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసులతో ఘర్షణలకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బరు బులెట్లను, బాష్ప వాయువును ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసు వాహనాలతో సహా ప్రభుత్వ వాహనాలను, షాపులను ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ నిరసనల్లో అమెరికాలోని పలువురు సెలబ్రిటీలు, పాప్ సింగర్లు, మోడల్స్ కూడా కూడా పాల్గొనడం విశేషం.