‘పోలీసులు పాటిస్తున్న ‘ఆ’ వైఖరిని బ్యాన్ చేయాల్సిందే…కానీ…’ ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2020 | 12:55 PM

కొంతమంది పోలీసులు అనుమానితులను అదుపు చేసేందుకు వారి మెడపై కాలితో నొక్కడం వంటి పద్దతులను పాటిస్తుంటారని, సహజంగా చెప్పాలంటే వీటిని నిషేధించవలసిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

పోలీసులు పాటిస్తున్న ఆ వైఖరిని బ్యాన్ చేయాల్సిందే...కానీ... ?
Follow us on

కొంతమంది పోలీసులు అనుమానితులను అదుపు చేసేందుకు వారి మెడపై కాలితో నొక్కడం వంటి పద్దతులను పాటిస్తుంటారని, సహజంగా చెప్పాలంటే వీటిని నిషేధించవలసిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో బహుశా పోలీసులకు ఇలాంటివి అవసరం కావచ్ఛు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక పోలీసు అధికారి.. అనుమానితుడి నుంచి ఘర్షణ వంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అసలు ‘చెక్ హోల్డ్స్’ (మెడపై కాలితో నొక్కి శ్వాస ఆడకుండా చేయడం) అన్న పదంలోని కాన్సెప్టే ‘అమాయకం’గా ఉంటుంద,ని అదే సమయంలో ఇది పర్ఫెక్ట్ అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. (జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మెడపై.. పోలీసు అధికారి  డెరెక్ చౌవిన్…. తన కాలిని బలంగా వేసి తొక్కిపెట్టడంతో ఊపిరి ఆడక జార్జి మరణించాడు.) ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి పధ్ధతి అని ట్రంప్ అభివర్ణించాడు. స్థానిక అధికారులకు తాను ఈ విధమైన సూచనలు చేస్తే చేయవచ్చునన్నాడు. ఫాక్స్ న్యూస్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు.. ఈ విధమైన పధ్దతులను పోలీసులు పాటించకుండా చూడాలని ఆయనను కోరారు.