టిక్ టాక్ పై నిషేధానికి ట్రంప్ ముందడుగు, బైట్ డాన్స్ కి 90 రోజుల గడువు

| Edited By: Anil kumar poka

Aug 15, 2020 | 1:50 PM

అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని నిషేధించే దిశగా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఈ సంస్థలోని తమ పెట్టుబడులను 90 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని దీని మాతృక సంస్థ అయిన బైట్  డాన్స్ ని ఆయన ఆదేశించారు.

టిక్ టాక్ పై నిషేధానికి ట్రంప్ ముందడుగు, బైట్ డాన్స్ కి 90 రోజుల గడువు
Follow us on

అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని నిషేధించే దిశగా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఈ సంస్థలోని తమ పెట్టుబడులను 90 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని దీని మాతృక సంస్థ అయిన బైట్  డాన్స్ ని ఆయన ఆదేశించారు. తమ దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పు తెచ్ఛేలా  బైట్ డాన్స్ చర్య తీసుకునే అవకాశం ఉందని తనకు అందిన సాక్ష్యాధారాలబట్టి తాను నమ్మవలసి వస్తోందని ఆయన అన్నారు. టిక్ టాక్ లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేలా బైట్ డాన్స్ పై ఒత్తిడి తేవడమే ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఆ సంస్థ ఇంకా దీనిపై స్పందించలేదు.

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసక్తి చూపుతోందని, అయితే వచ్ఛే సొమ్ములో తమకూ కొంత ‘అందితే, మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలను మేము సమర్థిస్తామని మోదీ పేర్కొన్నారు. కానీ ఇతర సంస్థలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాయని  సన్నాయి నొక్కులు నొక్కారు. టిక్ టాక్ పై బ్యాన్ కి సెప్టెంబరు 15 వరకు ఆయన డెడ్ లైన్ విధించిన సంగతి విదితమే.