17 అడుగుల పైథాన్ తో భీకర పోరాటం.. చివరకు అతడిదే విజయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2020 | 1:04 PM

ఫ్లోరిడాలో ఓ స్నేక్ హంటర్ సాహసాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. భయంకరమైన అతి భారీ కొండచిలువను వట్టి చేతులతో చంపగలిగిన అతని ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్ మెంట్..

17 అడుగుల పైథాన్ తో భీకర పోరాటం.. చివరకు అతడిదే విజయం
Follow us on

ఫ్లోరిడాలో ఓ స్నేక్ హంటర్ సాహసాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. భయంకరమైన అతి భారీ కొండచిలువను వట్టి చేతులతో చంపగలిగిన అతని ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్ మెంట్ డిస్ట్రిక్ట్ లో కాంట్రాక్టర్ గా పని చేస్తున్న మైక్ కిమెల్.. పాముల పట్ల సింహ స్వప్నమే.. సోషల్ మీడియాలో కొందరు ఇతడ్ని ముద్దుగా ‘ పైథాన్ కౌబాయ్’ అని వ్యవహరిస్తుంటారు. మనుషులను సులువుగా కబళించగల 17 అడుగుల భారీ రాకాసి పైథాన్ ని తాను ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్కులో చూశానని, దాన్ని పట్టుకోబోగా తప్పించుకుని తనపై దాడి చేసిందని మైక్ తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నాడు. నన్ను చుట్టివేసి పొదల్లోకి లాక్కుపోవడానికి అది ఎంతగానో ప్రయత్నించింది.. ఆ దాడుల నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నించాను.. దాని ఎటాక్ లో నా చేతులపైనా, నా శరీరంలోని ఎన్నో భాగాలపైనా తీవ్ర గాయాలు ఏర్పడ్డాయి.. రక్తమోడుతూనే దానితో భీకరంగా ఫైట్ చేశాను.. సుదీర్ఘ పోరు తరువాత దాన్ని చంపగలిగాను అని మైక్ కిమెల్ వివరించాడు.  రక్తంతో కూడిన తన చెయ్యి, మోకాలి ఫోటోలను కూడా మరో పోస్టులో  చూపాడు మైక్.. సాధారణంగా బర్మా పైథాన్లు  చాలా పొడవుగా ఉంటాయని, బరువైన ఇవి క్షణాల్లో తమ ఎరలను కబళించేస్తాయని జంతు నిపుణులు చెబుతున్నారు. తాజా సంఘటనలో మైక్ తాను  చంపిన పైథాన్ ని ఓ పెద్ద సంచీలో కుక్కడానికి నానా కష్టాలూ పడ్డాడట.. అయితే.. తన  సహచరుల తోడ్పాటుతో ఈ విషయంలో సఫలీకృతడయ్యాడు.