లాక్ డౌన్ కొనసాగించాలా ? ఆ ప్రసక్తే లేదన్న ట్రంప్.. ఎందుకంటే ?

| Edited By: Anil kumar poka

May 14, 2020 | 2:16 PM

అమెరికాలో కరోనా మరణాలను ఆపడానికి లాక్ డౌన్ కొనసాగించాలన్న వైద్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫోజీ సూచనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఈ హెచ్ఛరికను పాటించబోమన్నారు. ఇది తనకు సమ్మతం కాదని, ముఖ్యంగా దేశంలో...

లాక్ డౌన్ కొనసాగించాలా ? ఆ ప్రసక్తే లేదన్న ట్రంప్.. ఎందుకంటే ?
Follow us on

అమెరికాలో కరోనా మరణాలను ఆపడానికి లాక్ డౌన్ కొనసాగించాలన్న వైద్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫోజీ సూచనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఈ హెచ్ఛరికను పాటించబోమన్నారు. ఇది తనకు సమ్మతం కాదని, ముఖ్యంగా దేశంలో మళ్ళీ స్కూళ్లను ప్రారంభించకూడదన్న సూచనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. స్కూళ్లను, కాలేజీలను తిరిగి ప్రారంభించడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న ఫోజీ వ్యాఖ్యను కూడా ట్రంప్ ఖండిస్తూ.. మొదట మన దేశ ఎకానమీని పునరుధ్ధరించుకోవల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే దేశంలో 82 వేల మందికి పైగా కరోనా  రోగులు మృతి చెందారని  , ఇక  ఈ మరణ మృదంగాన్ని ఆపాలని ఫోజీ చేసిన అభ్యర్థనను ఆయన పెడచెవిన పెడుతూ.. మహా అయితే కొంత వయస్సు మళ్ళిన ప్రొఫెసర్లు గానీ టీచర్లు గానీ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను మళ్ళీ గెలవాలంటే ఈ దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన పేర్కొన్నాడు. అందువల్లే బిజినెస్ కార్యకలాపాలను, స్కూళ్లను రీఓపెన్ చేయాల్సిందే అని ఆయన కుండబద్దలు కొట్టారు.