‘ఆమె కన్నా నాకే ఎక్కువమంది భారతీయుల వత్తాసు’, ట్రంప్

| Edited By: Anil kumar poka

Aug 15, 2020 | 11:17 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్, ఆయన రన్నింగ్ మేట్ కమలా హారిస్ పై ఆరోపణల జోరు పెంచారు. జో బిడెన్ ఈ దేశ అధ్యక్షుడైతే.. దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండజాలరని, ఇక కమలా హారిస్ అయితే...

ఆమె కన్నా నాకే ఎక్కువమంది భారతీయుల వత్తాసు, ట్రంప్
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్, ఆయన రన్నింగ్ మేట్ కమలా హారిస్ పై ఆరోపణల జోరు పెంచారు. జో బిడెన్ ఈ దేశ అధ్యక్షుడైతే.. దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండజాలరని, ఇక కమలా హారిస్ అయితే మరీ ఘోరమని ఆయన వ్యాఖ్యానించారు. బిడెన్ దేశాధినేత అయితే ప్రతి పోలీసు డిపార్ట్ మెంటునూ అణచివేయడానికి ప్రయత్నిస్తారని, ఇక హారిస్ అయితే చెప్పే పని ఏముందని అన్నారు. హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి.. కానీ ఆమెకన్నా నాకే ఎక్కువమంది భారతీయుల వత్తాసు ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్ పోలీస్ బెనివోలెంట్ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. పోలీసులంటే హారిస్ కి ద్వేషమని, ఆమె, బిడెన్ ఇద్దరూ పోలీసులకు వామ పక్ష తీవ్రవాద కేంద్ర బిందువులుగా మారారని ఆరోపించారు.

హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఉండగా ‘చిన్నవారిని’ ప్రాసిక్యూట్ చేసి.. ‘పెద్దవారిని’ వదిలేసిందని కూడా ట్రంప్ దుయ్యబట్టారు.