హెచ్ 1-బీ వీసాదారులకు ఊరట, వారు మళ్ళీ అమెరికా రావచ్ఛు, అయితే..

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 7:51 AM

హెచ్ 1-బీ వీసా హోల్డర్లకు ట్రంప్ ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. తాము ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారిని అనుమతించాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది.

హెచ్ 1-బీ వీసాదారులకు ఊరట, వారు మళ్ళీ అమెరికా రావచ్ఛు, అయితే..
Follow us on

హెచ్ 1-బీ వీసా హోల్డర్లకు ట్రంప్ ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. తాము ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారిని అనుమతించాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించింది. భర్త లేదా భార్య తమ పిల్లలతో సహా వారిని..ప్రైమరీ వీసా హోల్డర్లతో బాటు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. లోగడ దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని పేర్కొన్నారు. అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ మేరకు జూన్ 22 న ఓ ప్రకటనపై సంతకం చేశారు.

తమ దేశ ఎకానమీని పునరుధ్దరించడానికి ట్రంప్ మళ్ళీ ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇన్ని రోజులు ఎందుకు జాప్యం చేశారో తెలియడంలేదు. మొత్తానికి తిరిగి హెచ్ 1-బీ వీసా హోల్డర్లలో ఆశలు చిగురించాయి.