ఆసుపత్రిలో చేరిన ట్రంప్, అయామ్ ఫైన్ అంటూ ….

| Edited By: Anil kumar poka

Oct 03, 2020 | 11:34 AM

కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు డాక్టర్లు ప్రయోగాత్మకంగా కోవిడ్ ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే తాను బాగానే ఉన్నానని ట్రంప్ ప్రకటించారు.

ఆసుపత్రిలో చేరిన ట్రంప్, అయామ్ ఫైన్ అంటూ ....
Follow us on

కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు డాక్టర్లు ప్రయోగాత్మకంగా కోవిడ్ ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే తాను బాగానే ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. మాస్క్ ధరించిన ఆయన శుక్రవారం సాయంత్రం తన వైట్ హౌస్ నుంచి హెలికాఫ్టర్ లో వాషింగ్టన్ నగరానికి దూరంగా ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రికి చేరుకున్నారు. తన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆయన కొన్నిరోజులు ఉండే అవకాశం ఉందని ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్  ఎనానీ తెలిపారు. ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేలీ చెప్పారు. వైట్ హౌస్ లో రికార్డు చేసిన 18 సెకండ్ల వీడియోలో..ట్రంప్ తన హెల్త్ గురించి వెల్లడించారు.

ట్రంప్ కు…. రీజెనరాన్ కంపెనీ ఉత్పత్తి చేసిన యాంటీ బాడీ కాక్ టెయిల్ ను ఇఛ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం  క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న దీన్ని రెగ్యులేటర్ ఆమోదించాల్సి ఉంది. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్…తాను, తన భార్య కరోనా టెస్ట్ చేయించుకున్నామని, ఇద్దరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ప్రకటించారు.