కమలా హారిస్ కి ట్రంప్ నాడు డోనర్ అన్న విషయం తెలుసా ?

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 11:13 AM

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ కి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఒకప్పుడు డోనర్ (విరాళమిచ్చిన దాత) అన్న విషయం చాలామంది మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడైతే...

కమలా హారిస్ కి ట్రంప్ నాడు డోనర్ అన్న విషయం తెలుసా ?
Follow us on

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ కి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఒకప్పుడు డోనర్ (విరాళమిచ్చిన దాత) అన్న విషయం చాలామంది మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడైతే ఆమెను ఆయన ‘రాడికల్ గుంపులో’ ఓ భాగమని, సెనేట్ లో ఆమెకు మర్యాదేలేదని తప్పు పడుతున్నారు గానీ.. కొన్నేళ్ల క్రితం ఆమెపై ఎంతో గౌరవం ఉండేదట. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి కమలా హారిస్ పోటీ చేసినప్పుడు 2011 లో  ట్రంప్ ఆమెకు ప్రచార నిమిత్తం 6 వేల డాలర్లు విరాళం ఇచ్చారట. ఆ తరువాత మళ్ళీ 2013 లో కూడా ఆయన కొంత విరాళం ఇఛ్చారని తెలిసింది. ఇక 2014 లో ట్రంప్ కుమార్తె  ఇవాంకా తన అటార్నీ జనరల్ కి 2 వేల డాలర్లను అందజేసింది. అయితే కమలా హారిస్ ఈ సొమ్మును ఓ మానవ హక్కుల బృందానికి ఛారిటీగా ఇచ్చినట్టు ఆమె ప్రచార ప్రతినిధి మెక్ క్లాచీతెలిపారు.

2015 వరకు కమలా హారిస్ ఈ విరాళాన్ని వినియోగించుకోలేదని, ఆ తరువాత ఏడాది అనంతరం ఆమె అటార్నీ జనరల్ గా  మళ్ళీ ఎన్నికైందని  మెక్ వెల్లడించారు. అయితే ట్రంప్ ఇలాగే అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులకు విరాళం ఇచ్చారని, కమలా హారిస్ నల్లజాతి మహిళ అయినప్పటికీ ఆమె ప్రచారానికి ఆయన డొనేషన్ ఇచ్చారంటే.. రేసిజం అన్న విమర్శలను మనం కొట్టివేయవచ్చునని ట్రంప్ రీ-ఎలెక్షన్ ప్రచారంలోని సీనియర్ అడ్వైజర్ కత్రినా పియర్సన్ పేర్కొన్నారు.