యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే ? ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 10:31 AM

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా తాను  అమీ కోనే బారెట్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం అమీ కోనే షికాగో లోని 7 th అపీల్స్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే ?  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
Follow us on

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా తాను  అమీ కోనే బారెట్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం అమీ కోనే షికాగో లోని 7 th అపీల్స్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గిన్స్ బర్గ్  ఇటీవల   మరణించడంతో ఆమె స్థానే మరో మహిళను జడ్జిగా నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి బార్బరా లాంగోవా అనే మరో మహిళా జడ్జి కూడా రేసులో నిలిచింది. అయితే ట్రంప్ 48 ఏళ్ళ అమీ కోనే వైపే మొగ్గు చూపారు. నవంబరు 3 న జరిగే అధ్యక్ష ఎన్నికకు ముందే ఈ నియామకాన్ని ఆయన చేపట్టవలసి ఉంటుంది. తన ‘ఎంపిక’ను సమర్థించవలసిందిగా ఆయన సెనేట్ రిపబ్లికన్లను కోరారు.