బైడెన్, కమలా హారిస్ పదవీ ప్రమాణం రోజున రంగవల్లులతో స్వాగతం, అప్పుడే సన్నాహాలు, అమెరికాలో ‘భారతీయత’

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 6:55 PM

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. వీరికి వెల్ కమ్ చెప్పడానికా అన్నట్టు రంగవల్లులు..

బైడెన్, కమలా హారిస్ పదవీ ప్రమాణం రోజున రంగవల్లులతో స్వాగతం, అప్పుడే సన్నాహాలు, అమెరికాలో భారతీయత
Follow us on

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. వీరికి వెల్ కమ్ చెప్పడానికా అన్నట్టు రంగవల్లులు (ముగ్గులు) తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా హారిస్ తమిళనాడుకు చెందినవారైనందున ఈ రంగవల్లుల సంప్రదాయం మొదలైంది. ఆరోగ్యం, వికాసం కలగాలంటే ముగ్గులు అందుకు దోహదం చేస్తాయని విశ్వసిస్తారు.  హిందూ సంప్రదాయమైన ఇది ముఖ్యంగా శుభ కార్యాలు, పండుగవేళ్లలో కనిపిస్తుంది. అమెరికా, ఇండియాలో అనేక చోట్ల సుమారు 1800 మందికి పైగా ఈ రంగవల్లులు వేసే లేదా అద్దే క్రమంలో ఉత్సాహంగా ఉన్నారు. ఇళ్ల ముందు ఇలా వేస్తే అత్యంత శ్రేష్టమన్నది హిందువుల భావన. ఇక బైడెన్, కమలా హారిస్అందమైన ఈ రంగురంగుల ముగ్గులను చూసి ఏమంటారో ?

Also Read:

Medaram: మేడారం మినీ జాతరకు వేళాయే.. తేదీలు ప్రకటించిన ఆలయ కమిటీ.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

వ్యాక్సిన్ తీసుకుని 24 గంటలయింది, ఐయామ్ ఫైన్, బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, అంతా టీకామందు తీసుకోవాలని సూచన

BJP MLA Passed Away: పుదుచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే , ట్రెజరర్ కేజీ శంకర్ మృతి, సంతాపం తెలిపిన రాజకీయ నేతలు