‘చిరంజీవి మెగాస్టార్ కాదు’.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

డియర్ చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ.. అనుచరుడిని కాను. ఎప్పటినుంచో మిమ్మల్ని నేను నటుడిగా మాత్రమే ఇష్టపడే వాడ్ని. ఒకప్పుడు నాతోటి నటులంతా సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు. కానీ నేనెప్పుడూ రాలేదు. రావాలనే ఆలోచన కూడా..

'చిరంజీవి మెగాస్టార్ కాదు'.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 04, 2020 | 6:11 PM

సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్‌పిరేషన్ ఎవరంటే.. వెంటనే తడుముకోకుండా.. ‘మెగాస్టార్ చిరంజీవి’ అనే చెప్తూ ఉంటారు. అలాంటిది చిరంజీవి ‘మెగాస్టార్ కాదని’.. సినీ నటుడు జేడీ చక్రవర్తి రాసిన ఓ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో చిరంజీవి గురించి పలు సంచలన విషయాలు వెల్లడించాడు చక్రవర్తి.

‘డియర్ చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ.. అనుచరుడిని కాను. ఎప్పటినుంచో మిమ్మల్ని నేను నటుడిగా మాత్రమే ఇష్టపడే వాడ్ని. ఒకప్పుడు నాతోటి నటులంతా సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు. కానీ నేనెప్పుడూ రాలేదు. రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయింది. ఎన్నడూ లేని విధంగా.. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టాలపాలయ్యారు.

ఇందులో నాతో పాటు మీరు కూడా ఉన్నారు. మనం కూడా ఎంతో కొంత కోల్పోయాం. ఇలాంటి సమయంలో మీరు ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ పెట్టి ఇతరుల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం అద్భుతం. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో.. నమ్ముతారో చెప్పడానికి ఇదే నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. మీరు ఓ గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. చాలా మంది సినీ కార్మికులు నాకు ఫోన్ చేస్తున్నారు. చిరంజీవి గారు లేకపోయింటే.. తమ కుటుంబాలు రోడ్డున పడేవని చెబుతున్నారు.

నలుగురూ ఆనందగా ఉండాలనే మీ వ్యక్తిత్వం గొప్పది. ఇప్పటి నుంచి నేను.. మీకు అభిమానినే కాదు.. అనుచరుడిని కూడా. మిమ్మల్ని ఎంతోగానో ఇష్టపడుతున్నా.. ప్రేమిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని’. అని ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తూ జేడీ.. మెగాస్టార్‌కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!