‘అరె ! పోయిందే !’ కరోనాపై వార్ లో గెలిచిన చైనా.. ఫస్ట్ టైం నో కోవిడ్-19 కేసు

| Edited By: Anil kumar poka

Mar 19, 2020 | 10:52 AM

ప్రపంచ దేశాలను ఓ వైపు కరోనా వణికిస్తుండగా..మరోవైపు దీనికి 'పుట్టినిల్లయిన' చైనాలో మాత్రం ఇది రివర్స్ అయింది. కరోనా వైరస్ మీద జరిపిన వార్ లో ఆ దేశం విజయం సాధించింది.

అరె ! పోయిందే ! కరోనాపై వార్ లో గెలిచిన చైనా.. ఫస్ట్ టైం నో కోవిడ్-19 కేసు
Follow us on

ప్రపంచ దేశాలను ఓ వైపు కరోనా వణికిస్తుండగా..మరోవైపు దీనికి ‘పుట్టినిల్లయిన’ చైనాలో మాత్రం ఇది రివర్స్ అయింది. కరోనా వైరస్ మీద జరిపిన వార్ లో ఆ దేశం విజయం సాధించింది. తమ దేశంలో మొట్టమొదటిసారిగా ‘జీరో డొమెస్టిక్ ఇన్ఫెక్షన్స్’ నమోదైనట్టు బీజింగ్ వర్గాలు తెలిపాయి. అయితే విదేశాలనుంచి వచ్ఛే కరోనా అనుమానిత కేసులే చైనీయులను ఆందోళనకు గురి చేస్తుంన్నాయి. ఈ వైరస్ కి ‘నాంది’ పలికిన వూహాన్ సిటీలో కొత్త కరోనా కేసులేవీ నమోదు కాలేదని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అసలు గత జనవరి 23 నుంచే ఈ సిటీతో బాటు ఇక్కడి కోటీ 10 లక్షల మందిని స్ట్రిక్ట్ క్వారంటైన్ లో ఉంచారు. ఆ తరువాత కూడా హుబీ ప్రావిన్స్ లోను, ఇతర రాష్ట్రాలలోను నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలను క్వారంటైన్ కి తరలించారు. పౌరులు ఒకచోట గుమికూడకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. కేవలం హుబీ ప్రావిన్స్ లో 8 డెత్ కేసులు బయటపడగా.. ఇప్పటివరకు చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,245 కి చేరినట్టు ఈ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

చైనాలో 81 వేల ఇన్ఫెక్షన్లు నమోదు కాగా 7,263 మంది మాత్రమే రోగులుగా తేలారు. ఇక వాల్డ్ వైడ్ గా కరోనాకు గురై 8,700 మంది మృత్యువాత పడగా.. సుమారు 2లక్షలమందికి ఈ వ్యాధి లక్షణాలు సోకాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెల 10 న మొదటిసారిగా వూహాన్ సిటీని సందర్శించి ఈ వ్యాధిని అదుపు చేయగలిగినట్టు ప్రకటించారు. వూహాన్, హుబీ ప్రాంతాలు తప్ప దేశంలో ఇతర చోట్ల జనజీవనం మెల్లగా తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంతోంది. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తుండగా.. అక్కడక్కడ   విద్యార్థులకు స్కూళ్ళు తెరచుకుంటున్నాయి.