‘ ఏనుగు టూత్ పేస్ట్ ‘ అట ! యూట్యూబర్ల ప్రయోగం.. వావ్ !

|

Dec 22, 2019 | 5:14 PM

కాలిఫోర్నియాలో ఇద్దరు యూట్యూబర్లు ఓ వెరైటీ ప్రయోగం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ ఏనుగు టూత్ పేస్ట్ ‘ అంటూ తమ ఇంటివెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో చిన్నపాటి ‘ కృత్రిమ వోల్కనో ‘ ను సృష్టించారు. హైడ్రోజెన్ పెరాక్సైడ్, సోప్ వాటర్, ఫుడ్ కు వేసే డై (రంగు) కలిపి లావా లాంటి ఫోమ్.. ఓ డోమ్ నుంచి విరజిమ్మేలా చేశారీ ‘ ఘనులు ‘. పైగా పొటాషియం అయోడైడ్ తో మరింత […]

 ఏనుగు టూత్ పేస్ట్  అట ! యూట్యూబర్ల ప్రయోగం.. వావ్ !
Follow us on

కాలిఫోర్నియాలో ఇద్దరు యూట్యూబర్లు ఓ వెరైటీ ప్రయోగం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ ఏనుగు టూత్ పేస్ట్ ‘ అంటూ తమ ఇంటివెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో చిన్నపాటి ‘ కృత్రిమ వోల్కనో ‘ ను సృష్టించారు. హైడ్రోజెన్ పెరాక్సైడ్, సోప్ వాటర్, ఫుడ్ కు వేసే డై (రంగు) కలిపి లావా లాంటి ఫోమ్.. ఓ డోమ్ నుంచి విరజిమ్మేలా చేశారీ ‘ ఘనులు ‘. పైగా పొటాషియం అయోడైడ్ తో మరింత హైడ్రోజెన్ పెరాక్సైడ్ కూడా కలిపి నీలి రంగు ఫోమ్ వెదజల్లే ఏర్పాటు చేశారు. ఈ మిశ్రమంలోకి ఆక్సిజన్ గ్యాస్ ను పంపగానే ఒక్కసారిగా సోప్ వాటర్ తోను, ఈ మిశ్రమంతోను కలిసి బ్లూ ‘ లావా ‘ బయటికి పొంగుకు వచ్చింది.

దీన్ని సరదాగా వారు ‘ ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ‘ అని వ్యవహరిస్తున్నారు. నిక్ ఉహాస్, డేవిడ్ డొబ్రిక్ అనే యూట్యూబర్లు ఇలాంటి సరికొత్త ప్రయోగం చేస్తే.. ఈ వీడియో ఫుటేజీని సుమారు పది లక్షలమంది చూసి నోరు వెళ్ళబెట్టారట. నాసాకు చెందిన మాజీ ఇంజనీర్ మార్క్ రోబర్ గతంలో ఈ విధమైన ఎక్స్ పెరిమెంట్ చేశాడని, అది చూసి తామూ ఇలా చేశామని వీళ్ళు చెబుతున్నారు. ఇది ఒకవిధంగా వెరైటీ స్టంటే అని అభివర్ణిస్తున్నారు. అన్నట్టు ఆక్సిజన్ గ్యాస్ ని ఈ మిశ్రమంలోకి పంపగానే పెద్ద శబ్దం కూడా రావడంతో.. కాస్త బెదురుతూనే అక్కడినుంచి ఈ ఇద్దరితో బాటు మరికొంతమంది కూడా పరుగులు తీశారు.