డొనాల్డ్ ట్రంప్-ట్విటర్ మధ్య హీటెక్కిన వార్

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 1:30 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్విటర్ మధ్య వార్ హీటెక్కింది. ఈ ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందని ట్విటర్ ను ట్రంప్ దుయ్యబడితే.. అసలు మీ ట్వీట్లకు ఆధారాలు లేవని, తప్పుడు క్లెయిములు చేస్తున్నారని ట్విటర్..

డొనాల్డ్ ట్రంప్-ట్విటర్ మధ్య హీటెక్కిన వార్
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్విటర్ మధ్య వార్ హీటెక్కింది. ఈ ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందని ట్విటర్ ను ట్రంప్ దుయ్యబడితే.. అసలు మీ ట్వీట్లకు ఆధారాలు లేవని, తప్పుడు క్లెయిములు చేస్తున్నారని ట్విటర్ కూడా ఎదురుదాడికి దిగింది. నిజాలను తొక్కిపెట్టి పోస్టులు పెడుతున్నారని ఈ సామాజిక మాధ్యమం ఆరోపిస్తే.. ఈ మాధ్యమం పూర్తిగా ఫ్రీ స్పీచ్ ను అణగదొక్కుతోందని, ఒక అధ్యక్షునిగా ఇలా జరగడాన్ని తాను అనుమతించబోనని ట్రంప్ గారు కూడా మండిపడ్డారు.

మెయిల్-ఇన్-ఓటింగ్ అన్నది ఫ్రాడ్ కు, ఎన్నికల రిగ్గింగ్ కి దారి తీస్తుందని.. ఏ విధమైన ఆధారాలు చూపకుండా ట్రంప్ ట్వీట్ చేయడంతో.. సోషల్ మీడియా జెయింట్ దీన్ని ఖండించింది. మెయిల్-ఇన్-బ్యాలెట్ల గురించి వాస్తవాలు తెలుసుకోండి అంటూ ఓ లింక్ ని పోస్ట్ చేసింది. ట్రంప్ తప్పుడు వ్యాఖ్యానాలు చేశారని పేర్కొంది. నిజానికి ఇలా జరుగుతుందనడానికి సాక్ష్యాధారాలు లేవని ‘ఫ్యాక్ట్ చెకర్లు’ కూడా స్పష్టం చేశారు. తన తప్పుడు కుట్రపూరిత థియరీలను, సమాచారాన్ని, వ్యాప్తి చెందింపజేసేందుకు ట్రంప్ లోగడ కూడా ట్విటర్ ను వేదికగా ఉపయోగించుకున్నారని, 80 మిలియన్ల ఫాలోవర్లను అవమానించారని ఆరోపణలు వచ్చాయి. 2016 లో ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకముందు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా దుయ్యబట్టారు. అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడైన ఒబామా ఈ పదవికి అర్హుడు కాదని ఆయన అప్పట్లోనే విమర్శించారు.