joe biden again call to benjamin netanyahu: కాల్పుల విరమణ పాటించండి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హితవు

| Edited By: Phani CH

May 18, 2021 | 12:56 PM

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడిన ఆయన..

joe biden again call to benjamin netanyahu: కాల్పుల విరమణ పాటించండి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు అమెరికా అధ్యక్షుడు  బైడెన్ హితవు
Joe Biden
Follow us on

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడిన ఆయన..అమాయక ప్రజల రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. కాల్పుల విరమణ పాటించండి..మీ కక్షలకు అమాయకుల ఉసురు తీయకండి అని కోరారు. రెండు రోజుల్లో బైడెన్..ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడడం ఇది రెండో సారి. మిమ్మల్ని మీరు రక్షించుకునే హక్కు మీకు ఉందని అంటూనే..ఉద్రిక్తతల నివారణకు ఈజిప్ట్ వంటి దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమోదించాలని కోరారు. ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి తాము కూడా ఇందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 15 న బైడెన్ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఇజ్రాయెల్ పై విచక్షణా రహితంగా రాకెట్ దాడులు జరపవద్దన్నారు. మరోవైపు-హమాస్, ఇతర పాలస్తీనా గ్రూపులు గాజా నుంచి 3,500 రాకెట్లను ప్రయోగించాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. తమ వైమానిక, ఆర్టిల్లరీ దాడుల్లో కనీసం 130 మంది మరణించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. గాజాలో 61 మంది పిల్లలతో సహా 212 మంది మృతి చెందారని, వీరిలో 36 మంది మహిళలని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

జెరూసలేం లోని ఆల్-అక్సా మసీదుపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడంతోను, సమీప ప్రాంతాలనుంచి ముస్లిములను బలవంతంగా ఖాళీ చేయించడంతోను ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రేగాయి. వరుసగా ఎనిమిదో రోజు కూడా గాజా సిటీ యుధ్ధభూమిని తలపించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మత్స్యకార కుటుంబాలకు శుభ వార్త… మీ బ్యాంకు ఖాతాలో ఆ డబ్బులు పడ్డాయోచ్..

TSPSC Recruitment 2021: క‌రోనా నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌.. ద‌రఖాస్తులకు గ‌డువు..