16 ఏళ్ళ అమ్మాయితో హాలీవుడ్ స్టార్ సైక్లింగ్

| Edited By: Ravi Kiran

Nov 05, 2019 | 5:43 PM

కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ షెవార్జ్‌నెగ్గర్ తాను ఎంతో అభిమానించే 16 ఏళ్ళ అమ్మాయి గ్రెటా థన్‌బెర్గ్‌తో కలిసి సైకిల్ తొక్కాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి ? ఇంకెవరు ? పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. వాల్డ్ లీడర్లను ‘ గడగడలాడిస్తున్న స్వీడిష్ గర్లే ! తన తోటి యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్న ఈ అమ్మాయి కాలిఫోర్నియా రాగానే ఆర్నాల్డ్ ‘ ఐసై ‘ పోయాడు. తనకే కోట్లాదిమంది అభిమానులు […]

16 ఏళ్ళ అమ్మాయితో హాలీవుడ్ స్టార్ సైక్లింగ్
Follow us on

కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ షెవార్జ్‌నెగ్గర్ తాను ఎంతో అభిమానించే 16 ఏళ్ళ అమ్మాయి గ్రెటా థన్‌బెర్గ్‌తో కలిసి సైకిల్ తొక్కాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి ? ఇంకెవరు ? పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. వాల్డ్ లీడర్లను ‘ గడగడలాడిస్తున్న స్వీడిష్ గర్లే ! తన తోటి యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్న ఈ అమ్మాయి కాలిఫోర్నియా రాగానే ఆర్నాల్డ్ ‘ ఐసై ‘ పోయాడు. తనకే కోట్లాదిమంది అభిమానులు ఉండగా.. ఆయన తన అభిమానిగా ఈ గర్ల్ ని చెప్పుకోవడం విశేషం. పైగా ఆమెను తన స్నేహితురాలని ఆప్యాయంగా పేర్కొన్నాడు. తన కూతురు క్రిస్టినాని గ్రెటాకు పరిచయం చేయడమే గాక.. తన ఎలక్ట్రిక్ కారులో ఆమె తిరిగేందుకు ఆ వాహనాన్ని కూడా ఇచ్చాడు.

కాలిఫోర్నియాలోని శాంటామోనికా ప్రాంతంలో తామిద్దరూ సైక్లింగ్ చేస్తున్న ఫోటోలను ఆర్నాల్డ్… ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ గతవారం నా ఫ్రెండ్, నా ‘ హీరోల్లో ‘ ఒకరైన గ్రెటా థన్‌బెర్గ్‌ను చూడడం ఫాంటాస్టిక్.. మేమిద్దరం కలిసి బైక్ రైడ్ చేసాం.. నా కుమార్తె క్రిస్టినాను ఈమెకు పరిచయం చేశాను.. కీప్ ఇన్స్పైరింగ్ గ్రెటా ‘ అని ట్వీట్ చేశాడు. అటు.. ఆర్నాల్డ్ ని తాను కలుసుకోవడం పట్ల ఈ స్వీడిష్ అమ్మాయి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తాను అభిమానించే వారి లిస్టులో ఈ కండల వీరుడి పేరును కూడా చేర్చింది. ఇక మరో హాలీవుడ్ స్టార్, ఆస్కార్ విజేత అయిన లియోనార్డో డీకాప్రియో తోనూ ఈ అమ్మాయి భేటీ అయింది. ఈమెను ప్రశంసలతో ముంచెత్తిన లియో.. ఈ క్లైమేట్ యాక్టివిస్టుతో మాట్లాడడం తనకెంతో గౌరవప్రదమని అన్నాడు. తామిద్దరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఇలా మెల్లగా.. గ్రెటా హాలీవుడ్ స్టార్లకూ ‘ సెలబ్రిటీ ‘ అయిపోయింది.