ఎన్నికల ప్రచారంలో మోదీ ఇమేజ్‌ను వాడుకుంటున్న ట్రంప్‌

|

Aug 24, 2020 | 4:22 PM

అమెరికా ఎన్నికల్లో గెలవడం ట్రంప్‌కు అగ్నిపరీక్షగా మారింది.. అందుకే కొత్త ఎత్తుగడలతో బరిలో దిగుతున్నారు. పోటీ గట్టిగానే ఉంది.. పైగా ప్రత్యర్థి పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి కమలాహారిస్‌ బరిలో దిగడంతో ట్రంప్‌కు ప్రవాసభారతీయుల శరణుజొచ్చక తప్పడం లేదు..

ఎన్నికల ప్రచారంలో మోదీ ఇమేజ్‌ను వాడుకుంటున్న ట్రంప్‌
Follow us on

అమెరికా ఎన్నికల్లో గెలవడం ట్రంప్‌కు అగ్నిపరీక్షగా మారింది.. అందుకే కొత్త ఎత్తుగడలతో బరిలో దిగుతున్నారు.. కిందటిసారి స్థానికత అంశాన్ని నెత్తికెత్తుకున్న ట్రంప్‌ ఈసారి మాత్రం మన ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్‌నే నమ్ముకున్నారు.. ప్రవాసభారతీయుల మనసులు గెల్చుకుని.. తద్వారా ఎన్నికల్లో గెలవాలన్నది ట్రంప్‌ ఉద్దేశం.. అందుకే ఎన్నికల ప్రకటనలలో నమస్తే ట్రంప్‌, హౌడీ మోదీలలో వీడియోలను వాడుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ వీడియోలో అవే ప్రధాన ఆకర్షణ! మరోసారి విజయం సాధించడం అంత వీజీ కాదనే విషయం ట్రంప్‌కు కూడా తెలుసు.

పోటీ గట్టిగానే ఉంది.. పైగా ప్రత్యర్థి పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి కమలాహారిస్‌ బరిలో దిగడంతో ట్రంప్‌కు ప్రవాసభారతీయుల శరణుజొచ్చక తప్పడం లేదు.. అప్పట్లో అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు.. అప్పుడు ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్‌ కూడా పాల్గొన్నారు.. అలాగే మొన్నామధ్య మోదీ ఇండియాకు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో ఓ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.. అందులో మోదీ పాల్గొన్నారు.. పాల్గొనడమే కాదు ట్రంప్‌ను మెచ్చుకుంటూ నాలుగైదు మాటలు కూడా మాట్లాడారు.. అలా ట్రంప్‌ను మెచ్చుకున్న మాటలతో ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందం చక్కటి వీడియోను తయారుచేసింది.. ఇది చూస్తే ప్రవాస భారతీయులు కచ్చితంగా ట్రంప్‌కే ఓటేస్తారన్నది వారి బలమైన నమ్మకం.

పోయిన ఫిబ్రవరి మాసంలో ట్రంప్‌ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వచ్చారు.. అహ్మదాబాద్‌లో ట్రంప్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ లభించింది. భారత ప్రధాని ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకే వేదికను పంచుకున్నది కూడా అక్కడే! ఆ సభలోనే ట్రంప్‌ను ఉద్దేశిస్తూ నాలుగైదు మెచ్చుకోలు మాటలు మాట్లాడారు మోదీ. ఇది ఇప్పుడు ట్రంప్‌కు బాగా అవసరమవుతున్నది.. అమెరికా లవ్స్‌ ఇండియా, అమెరికా రెస్పెక్ట్‌ ఇండియా అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను వీడియోలో యాడ్‌ చేసి బ్రహ్మండమైన ఎన్నికల యాడ్‌ను తయారు చేశారు.. ఇండో అమెరికన్లు ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలంటూ ఆయన ప్రచార నిర్వాహకులు కింబెర్లీ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో మోదీకి ఎంత వరకు లబ్ధి చేకూరుస్తుందో చూడాలి..