అమెరికాను తాకిన టోర్నడో… వార్నింగ్స్ జారీ

అమెరికాలో ముఖ్యంగా న్యూజెర్సీ , న్యూయార్క్ లను టోర్నడో తాకింది. మొదట సదర్న్ న్యూజెర్సీ లోని గ్లూసెస్టర్ కౌంటీని, న్యూయార్క్ లోని కనెక్టికట్ ని ఉప్పెన టచ్ చేసినట్టు నేషనల్ వెదర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ప్రాంతాల్లో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్న దృశ్యాన్ని తాము చూసినట్టు సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు. అప్పుడే టోర్నడో హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. హఠాత్తుగా మెరుపు వరదలు, భారీ వర్షాలు, గాలులతో టోర్నడో మొదలవుతోందని, కనెక్టికట్ వంటి […]

అమెరికాను తాకిన టోర్నడో... వార్నింగ్స్  జారీ
Follow us

|

Updated on: Jun 14, 2019 | 12:18 PM

అమెరికాలో ముఖ్యంగా న్యూజెర్సీ , న్యూయార్క్ లను టోర్నడో తాకింది. మొదట సదర్న్ న్యూజెర్సీ లోని గ్లూసెస్టర్ కౌంటీని, న్యూయార్క్ లోని కనెక్టికట్ ని ఉప్పెన టచ్ చేసినట్టు నేషనల్ వెదర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ప్రాంతాల్లో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్న దృశ్యాన్ని తాము చూసినట్టు సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు. అప్పుడే టోర్నడో హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. హఠాత్తుగా మెరుపు వరదలు, భారీ వర్షాలు, గాలులతో టోర్నడో మొదలవుతోందని, కనెక్టికట్ వంటి ప్రాంతాలకు దీని ముప్పు పొంచి ఉందని వారు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రికి దీని ప్రభావం మరింత పెరగవచ్చునన్నారు. ఉదయం ఎండతో బాటు ఓ మాదిరిగా వర్షం కురిసినా, ఆ తరువాత వాతావరణం మారిపోయి.. క్రమంగా ఉప్పెనగా మారింది. నెల రోజుల కాలంలో న్యూజెర్సీని ఈ ప్రకృతి వైపరీత్యం వణికించడం ఇది రెండో సారి. పెన్సిల్వేనియాలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్ కూడా ఉప్పెనకు గురి కావచ్చునని భయపడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. అమెరికాలోని పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయక చర్యలకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమైంది. నేషనల్ వెదర్ సర్వీస్ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన సూచనలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు – బ్రిటన్ లోనూ నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షం కారణంగా లండన్లోని వీధులన్నీ జలమయమయ్యాయి.

Latest Articles
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..