దెబ్బతిన్న డ్యాం.. సహాయక చర్యల్లో స్పెషల్ చాపర్స్

| Edited By:

Aug 03, 2019 | 4:49 PM

గత వారం వరకూ వేసవి గాలులతో అల్లాడిపోయిన ఇంగ్లాండ్‌లో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా 19వ శతాబ్ధంలో నిర్మించిన టాడ్‌బ్రూక్ జలాశయం నిండుకుండలా మారింది. నీటి వత్తిడితో ఈ పురాతన డామ్ దెబ్బతింది. ఏ క్షణంలో డ్యామ్ తెగుతుందోనన్న భయం స్థానికులన వెంటాడుతోంది. అప్రమత్తం అయిన అధికారులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. […]

దెబ్బతిన్న డ్యాం.. సహాయక చర్యల్లో స్పెషల్ చాపర్స్
Follow us on

గత వారం వరకూ వేసవి గాలులతో అల్లాడిపోయిన ఇంగ్లాండ్‌లో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా 19వ శతాబ్ధంలో నిర్మించిన టాడ్‌బ్రూక్ జలాశయం నిండుకుండలా మారింది. నీటి వత్తిడితో ఈ పురాతన డామ్ దెబ్బతింది. ఏ క్షణంలో డ్యామ్ తెగుతుందోనన్న భయం స్థానికులన వెంటాడుతోంది. అప్రమత్తం అయిన అధికారులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్యామ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో చినుక్ హెలికాప్టర్ల సాయంతో పెద్ద ఎత్తున ఇసుక బస్తాలను వేసి కట్టగా పేర్చుతున్నారు.