బద్దలైన స్ట్రోమ్‌బోలి అగ్నిపర్వతం

| Edited By:

Aug 30, 2019 | 6:28 PM

ఇటాలియన్‌ ఐలాండ్‌లో స్ట్రోమ్​బోలి అనే అగ్నిపర్వతం బద్దలైంది. పర్యాటకుల కళ్ల ముందే పెద్ద గర్జనతో పేలింది. నిప్పు కణికలతో కూడిన దట్టమైన బూడిద, పొగలు ఆకాశంలోకి విరజిమ్మడాన్నిపర్యాటకులు తమ మొబైల్స్‌లో బంధించారు. ఎగిసిపడిన లావా సముద్రంలో పడింది..సిసిలీ తీరంలో ఉన్న చిన్న ద్వీపంలో విస్పోటనం 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడిందని ఇటలీకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జియోఫిజిక్స్‌ అండ్‌ వాల్కనోలజీ తెలిపింది. రెండు నెలల్లో ఇది రెండవ పేలుడు. స్ట్రోంబోలి భూమిపై అత్యంత […]

బద్దలైన స్ట్రోమ్‌బోలి అగ్నిపర్వతం
Follow us on

ఇటాలియన్‌ ఐలాండ్‌లో స్ట్రోమ్​బోలి అనే అగ్నిపర్వతం బద్దలైంది. పర్యాటకుల కళ్ల ముందే పెద్ద గర్జనతో పేలింది. నిప్పు కణికలతో కూడిన దట్టమైన బూడిద, పొగలు ఆకాశంలోకి విరజిమ్మడాన్నిపర్యాటకులు తమ మొబైల్స్‌లో బంధించారు. ఎగిసిపడిన లావా సముద్రంలో పడింది..సిసిలీ తీరంలో ఉన్న చిన్న ద్వీపంలో విస్పోటనం 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడిందని ఇటలీకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జియోఫిజిక్స్‌ అండ్‌ వాల్కనోలజీ తెలిపింది. రెండు నెలల్లో ఇది రెండవ పేలుడు.

స్ట్రోంబోలి భూమిపై అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. 1932 నుంచి దాదాపుగా విస్పోటనం చెందుతోంది. జులైలో జరిగిన పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా..మరొకరు గాయపడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ ద్వీపంలో విస్పోటనం సమయంలో 5వేలమంది వరకు పర్యాటకులు ఉన్నారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో భయంతో పరుగులు తీశారు.